నాని హీరోయిన్ కు అరుదైన అవకాశం!

Lavanya-Tripathii getting ofFERS“భలే భలే మగాడివోయ్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి, తాజాగా “సోగ్గాడే చిన్నినాయనా” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకున్న ఈ భామ ఎకౌంటులో సక్సెస్ శాతం ఎక్కువగానే ఉంది.

2012లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ డెహ్రాడూన్ ముద్దుగుమ్మ ‘దూసుకెళ్తా’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ‘మనం’ చిత్రంలో తళుక్కున మెరిసిన లావణ్య గత ఏడాది నాని హీరోగా రూపొందిన “భలే భలే మగాడివోయ్” చిత్రంతో గ్లామర్ హీరోయిన్ గా నిరూపించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన “సోగ్గాడే చిన్నినాయనా” సినిమాలో ఏకంగా ‘కింగ్’ నాగార్జున సరసన మెరిసి, మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న లావణ్య నటించిన “లచ్చిందేవికి ఓ లెక్కుంది” సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఇది కూడా సక్సెస్ అయితే, “హ్యాట్రిక్” విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్ గా టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. “లచ్చిందేవికి ఓ లెక్కుంది” చిత్ర కధ లావణ్య చుట్టూ తిరిగేది కావడంతో, ఈ సినిమా విజయం ఆమెకు మరింత ఫేంను తెచ్చిపెడుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాలంలో హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళిపోతున్న నేపధ్యంలో లావణ్య నింపాదిగా నటిస్తూ, వరుస హిట్లు అందుకోవడం విశేషమే.

ADVERTISEMENT
Latest Stories