ఫేక్ న్యూస్ అలెర్ట్!

lavanya-tripati-tweets-on-fake-newsగత కొన్ని రోజులుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. టాలీవుడ్ దురదృష్టవంతురాలిగా పేర్కొంటూ… ఈ ఏడాది సూపర్ హిట్స్ గా నిలిచిన “తొలిప్రేమ, గీత గోవిందం” రెండు సినిమాలలో అవకాశాలను చేజార్చుకుందని ప్రచారం జరుగుతోంది. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత దక్కింది.

అయితే దీనిపై లావణ్య ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ఓ నెటిజన్ కు రిప్లై ఇస్తూ ఇదంతా ‘ఫేక్ న్యూస్ అలెర్ట్’ అంటూ పేర్కొంది. దీంతో ‘తొలిప్రేమ, గీత గోవిందం’ సినిమాలు లావణ్య దరిచేరలేదన్న విషయం స్పష్టమైంది. ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు చాలా సర్వసాధారణమే, అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలను చేజార్చుకోవడం ప్రతి హీరో, హీరోయిన్ల కెరీర్లలో నిత్యం జరిగేదే! ఎందుకంటే బ్లాక్ బస్టర్లు అవుతాయని ముందుగా తెలియదు గనుక!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories