కర్ణాటకలో కాలా రిలీజ్ కు లైన్ క్లియర్

Line clear for kaala release in karnatakaసూపర్ స్టార్ రజినీకాంత్ కాలా కర్ణాటకలో విడుదల కావడానికి రంగ సిద్ధమయ్యింది. కావేరీ జలాల పై రజినీకాంత్ స్టేట్మెంట్ ని వ్యతిరేకిస్తూ కాలాను కర్ణాటకలో బ్యాన్ చేసింది అక్కడి ఫిల్మ్ ఛాంబర్. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఇండైరెక్టుగా నిషేధాన్ని సమర్ధించారు. దీనితో కాలా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.

ADVERTISEMENT

వారి వాదనలు విన్న కోర్టు సినిమా విడుదల అయ్యే థియేటర్ల లిస్టును రాష్ట్రప్రభుత్వానికి అందించాలని, వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిలీజ్ అవనివ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సినిమాను విడుదల చెయ్యడానికి ముందుకు రాని థియేటర్ల ఓనర్లకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

దీనితో ఆ చిత్రం మల్టీప్లెక్స్ లలో విడుదల ఖాయం గా కనిపిస్తున్న మాములు సినిమా థియేటర్లలో విడుదల అనుమానంగానే ఉంది. ‘కాలా’ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మధ్య కాలంలో అతి తక్కువ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న రజినీకాంత్ సినిమా ఇదే కావడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories