రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్న “లవర్” సినిమా తొలి టీజర్ ప్రేక్షకులను పలకరించింది. టైటిల్ కు తగ్గట్లే హీరోయిన్ వెంటపడే హీరోకు సంబంధించిన సీన్స్ ను కట్ చేసి టీజర్ ను రిలీజ్ చేసారు. రొటీన్ గానే ఉన్నప్పటికీ, ఫస్ట్ ఇంప్రెషన్ ఓకే అనిపించేలా ఇచ్చారు రాజ్ తరుణ్ అండ్ కో. లవ్ ఎక్స్ ప్రెస్ చేసే డైలాగ్ మరిచిపోయిన విధానంలో వినోదం పండింది.
బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగుండగా, దిల్ రాజు సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ కనపడుతున్నాయి. అనిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా రిద్ధి కుమార్ అనే హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. లుక్స్ పరంగా ఈ హీరోయిన్ కు కూడా జస్ట్ ఓకే మార్కులు మాత్రమే పడ్డాయి. ఇటీవల ‘రాజుగాడు’ సినిమాతో వచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ‘లవర్’ పైనే ఆశలు పెట్టుకున్నాడు రాజ్ తరుణ్.
ADVERTISEMENT
ADVERTISEMENT



