తెలుగు ఇండస్ట్రీలో ‘కో- ఆపరేటివ్’కు ‘కాంప్లికేటేడ్’కు చాలా విలువ ఉంటుందని, ‘కో-ఆపరేటివ్’ అని చెప్తే ఏ హీరోయిన్ అయినా మనుగడ సాగిస్తుందని, కానీ నా విషయంకు వచ్చేసరికి వినిపించిన మాటలు ‘కాంప్లికేటేడ్, యాటిట్యూడ్’ అని అందుకే తానూ స్టార్ హీరోయిన్ కాలేకపోయానని, బేసిక్ గా ఇవే కారణాలని తెలుగు హీరోయిన్ మాధవిలత తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
సాధారణంగా మొదటి సినిమా పనిచేసిన వారినే ఎవరైనా అడుగుతారని, వాళ్ళు ‘కో-ఆపరేటివ్’ అని చెప్తే, తర్వాత సినిమాలో అవకాశం వస్తుందని, అలా అలా ఎదుగుదల ఉంటుందని, లేదు ఫలానా హీరోయిన్ ‘యాటిట్యూడ్’ అంటే, వారి జీవితం నాలాగే ఉంటుందని, నేను కూడా ‘కో-ఆపరేటివ్’ అయితే ఎక్కడో ఉండేదానినని ఇండస్ట్రీ వాతావరణాన్ని బయటపెట్టింది. అలాగే తానూ యుఎస్ లో ఎక్కువగా ఉంటున్నట్లు సృష్టించారని, కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడానికి యుఎస్ వెళ్ళిన మాట నిజమే గానీ, అక్కడే ఉండడం లేదని తెలిపింది.
యుఎస్ లో ఇప్పటివరకు దాదాపుగా 50 కార్యక్రమాలలో పాల్గొన్నానని, ఒకసారి పిలిచిన వారు రెండోసారి తనను పిలవరని, ఎందుకంటే ‘మాధవిలత కో-ఆపరేటివ్ కాదు కదా’ అంటూ తన ఆవేదనను వెలిబుచ్చుకుంది. యుకే ఒక బాగా డబ్బున్న వ్యక్తితో తనకు పెళ్లి చేసారని, అలాగే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ, గ్రీన్ కార్డు కూడా ఇప్పించారని, ఇలా నాపై చాలా చాలా వార్తలు పుట్టించారని, నువ్వు యుఎస్ లో ఉన్నావా? హైదరాబాద్ లో ఉన్నావా? అంటూ ఎటకారంగా స్నేహితులు, నటులు అందరూ అడుగుతుంటారని వ్యాఖ్యానించింది.



