‘హాట్’ డైలాగ్ తో టాలీవుడ్ ‘హీరోయిన్’ షార్ట్ ఫిల్మ్ టీజర్!

On Mona Birthday Teaser, Narendra Nath, Madhavi Latha, Sunil Kasyap, pasupuleti madhavi latha, Telugu short film, Telugu movies, tollywood, youtubeటాప్ ముద్దుగుమ్మలు కూడా షార్ట్ ఫిల్మ్ లను చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం బాలీవుడ్ హీరోయిన్లకు పరిపాటి. ముఖ్యంగా ‘లెజెండ్’ ఫేం రాధిక ఆప్టే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా విపరీతమైన ప్రచారాన్ని ఆర్జించింది. బహుశా రాధికానే స్ఫూర్తిగా తీసుకుందో ఏమో గానీ, టాలీవుడ్ లో ఓ హీరోయిన్ త్వరలో ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ముందుకు రానుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.

“నేను చేసే పనిలో చలికి ప్లేస్ లేదు… నేను హాట్…” అంటూ ‘నచ్చావులే’ ఫేం మాధవిలత ఓ హాట్ డైలాగ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ‘ఆన్ మోనాస్ బర్త్ డే’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏంటో పూర్తిగా తెలియరాలేదు గానీ, 33 సెకన్ల టీజర్లో మాత్రం మాధవిలత హాట్ హాట్ గా దర్శనమిచ్చింది. సినిమాలకు దూరంగా జరిగిన తర్వాత ఓ ఐటీ సంస్థను నెలకొల్పిన మాధవి, చాలాకాలం తర్వాత మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై అదృష్టం ఎంత ఉందో తేలిపోవడంతో, ఇప్పుడు బుల్లితెర వంతు వచ్చినట్లుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories