మహానటి… బాగా దెబ్బ కొట్టేసింది..!

Mahanati beats Naa Peru Surya recordsవక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “నా పేరు సూర్య” బాక్సాఫీస్ వద్ద నిరాశజనమైన ఫలితాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన అయిదు రోజులకే “మహానటి” సినిమా కావడం, అది ప్రేక్షకుల నుండి ‘బ్లాక్ బస్టర్’ టాక్ ను సొంతం చేసుకోవడం, పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చేసింది. తొలి వారం ముగిసే సమయానికి పెట్టిన పెట్టుబడికి కేవలం సగం మాత్రమే రికవర్ అయినట్లుగా ట్రేడ్ వర్గాల టాక్.

ADVERTISEMENT

బహుశా ‘మహానటి’ రిలీజ్ కాకపోయినట్లయితే, సమ్మర్ కాస్త అనుకూలంగా మారి ‘నా పేరు సూర్య’ తక్కువ నష్టాలతో గట్టెక్కి ఉండేదేమో! కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద “మహానటి” క్లీన్ స్వీప్ చేస్తుండడం, అప్పటికే కొన్ని ధియేటర్లలో “భరత్ అనే నేను, రంగస్థలం” తిష్ట వేసుకుని ఉండడంతో, ‘నా పేరు సూర్య’కు భారీ నష్టాలు తప్పేలా లేవన్నది సినీ వర్గాల సమాచారం. దీంతో ‘దువ్వాడ జగన్నాధమ్, నా పేరు సూర్య’ సినిమాలతో వరుసగా రెండు ప్రతికూల ఫలితాలను అల్లు అర్జున్ చూసినట్లయ్యింది. ఇదిలా ఉంటే నెక్స్ట్ డైరెక్టర్ ను ఇప్పటివరకు బన్నీ ఖరారు చేయలేదు.

ADVERTISEMENT
Latest Stories