గోల్డ్ స్పాట్ డ్రింక్ ఎప్పటిదో కదా..? అర్జున్ రెడ్డి కి గోల్డ్ స్పాట్ డ్రింక్ కి సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా.. ! ‘మహానటి’ – సావిత్రి బయో పిక్ లో నటిస్తున్న.. విజయ్ దేవరకొండ – సమంత లకు ఒక పాట ఉంది.ఆ పాట లోని దే ఈ స్టిల్. ‘సదా.. నన్ను’ అంటూ సాగే పాటని.. విజయ్ దేవరకొండ , సమంతల తో చిత్రీకరించారు, దర్శకుడు నాగ్ అశ్విన్. రేపు సాయంత్రం 5 గంటలకి ఈ పాటని సోషల్ మీడియా వేదికగా, రిలీజ్ చెయ్యబోతున్నారు.
మిక్కీ. జె. మేయర్ సంగీతం అందించిన ‘మహనటి ‘ సినిమా పాటల్లో, ఇదివరకే .. ‘మూగ మనసులు’ అనే పాట విడుదలయ్యింది. అంతగా ఆదరణకు నోచుకోలేదు. రేపు విడుదలవుతున్న
పాట అయినా ఆదరణ పొందుతుందో?.. లేదో?. కీర్తి సురేష్ ‘సావిత్రి ‘ పాత్రలో నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్.. ‘ జెమిని గణేశన్ ‘ గా నటిస్తున్నాడు.జర్నలిస్ట్ ‘ మధురవాణి ‘ గా సమంత .. కెమరామెన్ ‘ విజయ్ ఆంటోనీ ‘ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా మే లో విడుదల కానుంది.



