మహర్షి 50 రోజుల ఫంక్షన్ రద్దు కాదు.. వాయిదా

Maharshi - 50 Days function not cancelled, only postponedమహేష్ బాబు మాతృమూర్తి విజయ నిర్మల కన్నుమూయడంతో ‘మహర్షి’ సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. జూన్‌ 28న 50 రోజుల విజయోత్సవ వేడుకను మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించాల్సి ఉంది. ఈక్రమంలో.. విజయ నిర్మల బుధవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించడంతో వేడుకను వాయిదా వేశారు. మొదట ఈ కార్యక్రమం రద్దు అవుతుందని ప్రచారం జరిగినా వేడుక వాయిదా పడిందని చిత్ర బృదం చెప్పింది.

అయితే వేడుకను ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో గతకొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న విజయనిర్మల చికిత్స పొందుతూ బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. విజయనిర్మల పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఇంటికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. విజయనిర్మల భౌతికకాయాన్ని చూసి కృష్ణ, ఆయన సతీమణి ఇందిరా దేవి, తనయుడు నరేశ్‌ కన్నీరుమున్నీరయ్యారు.

ADVERTISEMENT

మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత కూడా ఆమె పార్థీవ దేహానికి కడసారి నివాళులు ఆరోపించారు. పార్థివదేహాన్ని ఇవాళ ఇంట్లోనే ఉంచి రేపు ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారు. విజయనిర్మల భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయనిర్మల మరణంతో ఈ రోజు జరగాల్సిన ‘కల్కి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా వాయిదా పడింది. ఫిలిం ఇండస్ట్రీ కు చెందిన వారంతా సోషల్ మీడియాలో తమ సంతాప సందేశాలతో ముంచెత్తుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories