‘మహేష్ 23’ ఫస్ట్ లుక్ లీక్ న్యూస్!

దాదాపుగా ఒక సంవత్సరం… 13 చిన్న, పెద్ద పండగలు… 4 సార్లు వాయిదా… ఇది మురుగదాస్ – మహేష్ బాబుల సినిమా ‘ఫస్ట్ లుక్’కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ న్యూస్. ఇక, టైటిల్ విషయం చెప్పనవసరం లేదనుకుంటా! పాత కాలం ‘ఏజెంట్ శివ’ దగ్గర నుండి ‘సంభవామి’ వరకు అనేక టైటిల్స్ సందడి చేయగా, చివరికి ‘స్పైడర్’తో ప్రిన్స్ రాబోతున్నట్లుగా ఖరారయ్యింది. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫిషియల్ లీక్స్ జరగకుండా జాగ్రత్త పడిన చిత్ర యూనిట్, మరికొద్ది గంటల్లో ఫస్ట్ లుక్ ను తీసుకువస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ కోసం మహేష్ బాబు అశేష అభిమానులతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ సమాచారం హల్చల్ చేస్తోంది. బ్లాక్ టీ షర్టు ధరించిన లుక్ తో ప్రిన్స్ మహేష్ బాబు దర్శనమివ్వనుండగా, మహేష్ లుక్ క్రింద ‘స్పైడర్’ టైటిల్ ఉండనుందని ఈ లీకేజ్ న్యూస్. అయితే అగ్ర హీరోలపై ఉండే క్రేజ్ రీత్యా, సోషల్ మీడియాలో సహజంగా ఇలాంటి న్యూస్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇందులో ఎంత వాస్తవం అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories