మెహర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ బాబు!

mahesh babu ad under maher ramesh directionవరుస వైఫల్యాలతో సినీ అవకాశాలను చేజార్చుకున్న ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన యాడ్ ను ప్రిన్స్ తన ఫేస్ బుక్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు. విజయవాడ – గుంటూరు హైవేలో రామకృష్ణ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ కొత్తగా నిర్మాణం చేయబోతున్న ‘వెన్ జుయా’కు ప్రిన్స్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

దీనికి సంబంధించిన షూటింగ్ ను మెహర్ రమేష్ పూర్తి చేసారు. ఈ విషయాన్ని తెలిపిన మహేష్, యాడ్ లోని అద్భుతమైన విజువల్స్ కు గానూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాము నిర్మించబోయే ఫ్లాట్లు ఇలా ఉంటాయని చూపించిన విజువల్స్ మరియు అందులో మహేష్ తిరుగుతున్నట్లుగా ఉన్న సన్నివేశాలు వీక్షించడానికి బాగానే ఉన్నాయి.

ADVERTISEMENT

మహేష్ బాబు సొంత ఊరు బుర్రిపాలెం కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం 4.30 నిముషాలకు, దీనిని ప్రారంభించబోతున్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్మాణం కాబోతున్న ఈ ప్రాజెక్ట్ కు ప్రిన్స్ బ్రాండ్ అంబాసిడర్ కావడంతో స్పందన బాగానే వస్తుందని నిర్మాణ సంస్థ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రియల్ బూమ్ లేకపోవడంతో మహేష్ పేరైనా మార్కెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories