‘ప్రత్యేక హోదా’పై మహేష్ బాబుకు ప్రశ్న!

Three-Exclusive-Mahesh-Babu-Sentiments-–-What-Will-Bharat-Ane-Nenu-Break“భరత్ అనే నేను” సూపర్ సక్సెస్ తో ప్రస్తుతం ఎన్నడూ లేనంత సంతోషంగా ప్రిన్స్ మహేష్ బాబు కనపడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యేక హెలికాఫ్టర్ లో విజయవాడ, తిరుపతిలను సందర్శించిన మహేష్ బాబును తిరుపతిలో ఓ మీడియా ప్రతినిధి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసాడు. తమిళనాడు జల్లికట్టు మాదిరి, ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక హోదాపై ఉద్యమం జరుగుతున్న నేపధ్యంలో… సినీ పరిశ్రమ ఎందుకు స్పందించలేదు? అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ నుండి మైక్ తీసుకున్న కొరటాల… ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించి ఇక్కడికి వచ్చారని, అంత ప్రాముఖ్యమైన ప్రశ్నను ఇంత చిన్న వేదికపై, అది కూడా ధియేటర్లో చెప్పమనడం కరెక్ట్ కాదని, మరో సమయంలో ఓ పెద్ద వేదికపై చెప్తే బాగుంటుందని, ఇప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమా గురించి అడగాలని తనదైన లాజిక్ తో చెప్పుకొచ్చారు. ఈ జవాబుకు ఫిదా అయిన మహేష్, వెనుకగా చప్పట్లతో అభివాదాలు చేసారు.

ADVERTISEMENT

ఇదే వేదికపై… మీరు రియల్ లైఫ్ సిఎం ఎప్పుడు అవుతారు? అంటూ మరో విలేఖరి ప్రశ్నించగా, ‘మీరు ఈ మధ్యన తాను ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏవీ చూసినట్లుగా లేరు’ అంటూ చమత్కరిస్తూ… తనకు, రాజకీయాలకు సంబంధం లేదని మరోసారి తేల్చిచెప్పారు. ఇలాగే బ్లాక్ బస్టర్లు ఇస్తూ ఉంటే, ప్రతి సినిమా రెండవ వారం శ్రీవారిని దర్శించుకుని, మిమ్మల్ని ఇలాగే కలుస్తూ ఉంటానని ఈ సందర్భంగా అభిమానులకు హామీ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories