మహేష్ బాబు సినిమా ‘వాయిదా’ కబుర్లు!

brahmostavam mahesh babuశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న “బ్రహ్మోత్సవం” సినిమా వాయిదాల పరంపర కొనసాగుతోంది. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 24వ తేదీన తిరుపతిలో అంగరంగ వైభవంగా విడుదల చేయనున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ డేట్స్ హల్చల్ చేస్తున్నాయి.

ADVERTISEMENT

మే 1వ తేదీన తిరుపతిలోనే ఆడియో వేడుక జరపనున్నారని, అలాగే ముందుగా అనుకున్న సినిమా విడుదల తేదీని మే 6 నుండి 20వ తేదీకి వాయిదా వేసారని తెలుస్తోంది. ఈ సమాచారం ప్రిన్స్ అభిమానులకు కాస్త నిరుత్సాహం కలిగిస్తున్నప్పటికీ, ఇటీవల ఉగాది సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై నమ్మకాన్ని పెంచింది. దీంతో ఆలస్యమైనా పర్లేదు… హిట్టు సినిమాను అందిస్తే చాలు అనే ఆలోచనల్లో నిమగ్నమయ్యారు ప్రిన్స్ ఫ్యాన్స్. తాజాగా ‘బ్రహ్మోత్సవం’కు సంబంధించి తమిళంలో మరో పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

‘బ్రహ్మోత్సవం’ వాయిదాలతో మురుగదాస్ చిత్రం కూడా వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభోత్సవం చేయాలని భావించినప్పటికీ, ఆ తేదీకి అసాధ్యం అని దాదాపుగా తేలిపోయింది. దీంతో ఈ సినిమా ప్రారంభ ముహూర్తం కూడా మే నెలలోనే ఉండవచ్చని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories