దక్షిణాది సెలబ్రేటీల హోదాను జాతీయ వ్యాప్తంగా చాటడంలో ప్రిన్స్ మహేష్ బాబుకు మరొకరు సాటిలేరు అనే విధంగా ప్రిన్స్ ప్రభంజనం కొనసాగుతోంది. ‘మోస్ట్ డిజైరబుల్ మ్యాన్’ పేరుతో జాతీయ వ్యాప్తంగా ఎంపిక చేసిన జాబితాలో మన టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా ప్రిన్స్ ఇదే స్థానంలో నిలవడం విశేషం. దక్షిణాది నుండి టాప్ 10లో చోటు దక్కించుకున్న హీరో కూడా మహేష్ బాబు ఒక్కడే కావడం ప్రిన్స్ స్టామినాకు నిదర్శనం.
ఇక, నెంబర్ 1 స్థానంలో ‘బాజీరావు మస్తానీ’ హీరో రన్వీర్ సింగ్ దక్కించుకోగా, 2వ స్థానంలో విరాట్ కోహ్లి, పర్హాద్ ఖాన్ 3వ స్థానం, హృతిక్ కు 4, సిద్దార్ద్ మల్హోత్రా 5వ స్థానంలో నిలిచారు. టాప్ 10 విభాగంలో మహేష్ క్రింది స్థానాలలో రోహిత్ ఖండెల్ వాల్ 7, వరుణ్ ధావన్ 8, షాహిద్ కపూర్ 9, రణబీర్ కపూర్ 10 స్థానాలు కైవసం చేసుకున్నారు. 2015 సంవత్సరానికి గానూ ఈ జాబితా విడుదలైంది.



