సూపర్ స్టార్ మహేష్‌బాబు తన బావ సుధీర్‌బాబు హీరోగా ఎదిగేందుకు తనవంతు సాయం అందిస్తూనే ఉన్నాడు. సుధీర్ బాబు సినిమా ప్రమోషన్‌లో ఏదో ఒక విధంగా పాలు పంచుకుంటూనే ఉన్నాడు. ఆ మధ్య సుధీర్‌బాబు నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ చిత్రంపై మహేష్‌బాబు ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. తాజాగా సుధీర్‌బాబు నటించిన ‘భలే మంచి రోజు’ చిత్రానికి కూడా మహేష్‌బాబు తన ఆశీస్సులను అందించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈనెల 25న జరుగబోతున్న ‘భలే మంచి రోజు’ ఆడియో విడుదల కార్యక్రమంలో మహేష్‌బాబు పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్‌బాబు మునుపటి కంటే జోష్‌తో మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలు మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు మరియు నిర్మాతలు మహేష్‌బాబును ఆడియో విడుదల కార్యక్రమానికి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్‌బాబుతో సుధీర్‌బాబు మాట్లాడాడు అని, వస్తానని మహేష్‌బాబు కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.





