మహర్షికి…లైన్ క్లియర్…ఇక దూసుకుపోవడమే!

Mahesh Babu Maharshi ready for release-ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రిన్స్ ఫాన్స్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూషన్ సినిమా మొదలయినప్పటి నుంచి ఉంది. ఎట్టకేకలకు సినిమా వేసవికి వస్తుంది అని కంఫర్మ్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా సినిమా ఆ డేట్ కి వస్తుందో అన్న క్లారిటీ లేకపోవడంతో ఆ సినిమాను ఆధారంగా చేసుకుని చిన్న సినిమాలు తెగ టెన్షన్ పడిపోయాయి ఇప్పటివరకూ.

అయితే తాజాగా దిల్ రాజు మహర్షి సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు కంఫర్మ్ చెయ్యగానే రంగంలోకి దిగిన చిన్న సినిమాలు వరుసగా వాటి రిలీజ్ లను ప్రకటించేసాయి అనే చెప్పాలి.

ADVERTISEMENT

అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఈ సినిమా అన్నీ మహర్షికి ముందే వచ్చి వెళ్ళిపోవాలి అని పక్కా ప్లాన్ తో వేసవికి వస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలు అందులో నాగచైతన్య-సమంతల సినిమా ‘మజిలీ’, సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’, సూర్య ‘NGK’, నాని ‘జెర్సీ’, లారెన్స్ ‘కాంఛన-3’ అన్నీ మహర్షికి ముందే వచ్చి వెళ్లాలని పక్కా ప్లాన్ లో ఉన్నాయి.

అంటే ఈ లెక్కన ఏప్రిల్ 25న రంగంలోకి దిగుతున్న ప్రిన్స్ సినిమాకి లైన్ క్లియర్ అన్న మాట. మరి వంశీ పైడిపల్లి ప్రిన్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేసాడో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories