ఇదేదో మరో ‘శ్రీమంతుడు’లాగా ఉంది!

Mahesh Babu Maharshi Storyప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మనం స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అయితే అలాంటి సినిమా మళ్ళీ వస్తే ప్రేక్షకులు చూస్తారా? అంటే ఛస్తే చూడరు ఎందుకంటే తెలిసిన కధని, చూసిన కధని ఎలా చూస్తారు.

సరే ఇప్పుడు అసలు మ్యాటర్ కి వద్దాం, మహేష్ ఇప్పు వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న మహర్షి సినిమాలో ఒక బిగ్ షాట్ గా…రిచ్ కిడ్ గా నటిస్తున్నట్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న కధ. అదే క్రమంలో హీరో ఇంటర్వెల్ లో పూర్తిగా మారిపోయి సెకండ్ హాఫ్ మొత్తం కామన్ మాన్ గా ఉండే కధ అని తెలుస్తుంది.

ADVERTISEMENT

సరిగ్గా గమనిస్తే శ్రీమంతుడు కూడా ఒక రకంగా ఇలానే ఉంటుంది, కాకపోతే, ఊరు దత్తత అనే కధ దానికి యాడ్ అయి ఉంటుంది, ఇక ఈ మహర్షి లో కూడా ఫ్రెండ్ కోసం ప్రిన్స్ సెకండ్ హాఫ్ మొత్తం కామం మాన్ అయిపోతాడట. ఇక ఇదే లైన్ శ్రీమంతుడులో అయితే హీరోయిన్ కోసం మారిపోతాడు.

మొత్తంగా చూస్తే మహర్షి మరో శ్రీమంతుడులాగే అనిపిస్తుంది. మరి రిలీజ్ అయితే కానీ తెలీదు ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్స్ ఉన్నాయో. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని అందిస్తుందో.

ADVERTISEMENT
Latest Stories