టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ సినిమాను నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారా? మెగా కాంపౌండ్ లో పది మంది హీరోలను పెట్టుకుని, వేరే హీరోతో అల్లు అరవింద్ సినిమాను నిర్మిస్తారా? ఇటీవల కాలంలో చిన్న సినిమాలను అయితే నిర్మిస్తున్నారు గానీ, మహేష్ బాబు వంటి టాప్ హీరోతో సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారా? అంటే టాలీవుడ్ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి.
కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు – అల్లు అరవింద్ ల భేటీ అయ్యిందని, ఈ సందర్భంగా ప్రిన్స్ తో ఓ సినిమాను నిర్మించేందుకు ప్రతిపాదనలు చేయగా, అందుకు ప్రిన్స్ కూడా ఓకే అన్నట్లుగా ఈ వార్తల సారాంశం. నమ్మశక్యం కాని అసలు విషయం ఏమిటంటే… తన కొడుకును హీరోగా పెట్టుకుని సినిమా చేయాలంటేనే ప్రతి రూపాయి లెక్కలేసుకుని మరీ చేస్తారన్న టాక్ అల్లు అరవింద్ పై ఉంది. ‘బద్రీనాథ్’ సినిమా వేడుకపైన స్వయంగా అల్లు అర్జున్ కూడా ఈ వ్యాఖ్యలు చేసారు.
మరి అలాంటి అల్లు అరవింద్ భారీ వ్యయంతో కూడిన మహేష్ తో సినిమా చేయడం కేవలం వార్తలకే పరిమితం అవుతుందా? లేక కార్యరూపం సిద్ధించుకుంటుందా? ఏమో… ప్రస్తుతానికి అయితే తన 25వ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ ల చేతిలో పెట్టిన ప్రిన్స్, 26వ సినిమాను మైత్రీ మూవీస్ తో జత కట్టనున్నారు. అలాగే రాజమౌళితో సినిమా కోసం కే.ఎల్.నారాయణ నిర్మాతగా ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. మరి ఇంతలో అల్లు అరవింద్ ఎలా వస్తారో చూడాలి. మహేష్ జాబితాలో ఉన్న డైరెక్టర్స్ లిస్టుకైతే కొదవలేదు గానీ, ఈ కాంబో న్యూస్ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.



