సమంతది ఒక అమాయకత్వపు ట్వీట్ – మహేష్!

Mahesh babu samantha commentsప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల నుండి ‘కుందనపు బొమ్మ’ సమంత దూరం కావడానికి కారణమైంది ఒక ట్వీట్. ఏమీ లేని విషయంపై సమంత రేపిన రాద్ధాంతంపై సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ ఫ్యాన్స్ దండెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉదంతం పై గతంలో ప్రిన్స్ స్పందిస్తూ… సమంత ట్వీట్ చేసే దాని కన్నా నమ్రతకు ఒక ఫోన్ చేసి చెప్పినా సరిపోయేదని అభిప్రాయ పడ్డారు. అయితే మహేష్ శాంతించినా… అభిమానులు మాత్రం సమంతను ఉపేక్షించలేదు. అవకాశం చిక్కినప్పుడల్లా సందర్భం ప్రకారం జెస్సీని టార్గెట్ చేస్తూ వచ్చారు.

మరి అలాంటి సమంతతో ప్రిన్స్ మరో సినిమా చేయడం పట్ల ఒకానొక సందర్భంలో అభిమానులు కూడా వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో మహేష్ ను ప్రశ్నిస్తే… సమంత చేసింది ఒక అమాయకత్వపు ట్వీట్ అని తేల్చిచెప్పాడు. అలాంటి విషయాలను అక్కడితో వదిలేసి ముందుకెళ్లాలని, చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ప్రిన్స్ “1 నేనొక్కడినే” వివాదానికి ముగింపు పలికారు. సమంతతో వివాదం ఎలా ఉన్నా… ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో గుర్తింపు పొందే పాత్ర పోషించిందని ప్రిన్స్ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories