సరిలేరు నీకెవ్వరు షూటింగ్ మొదలు కాకముందే రెండు పెద్ద డీల్స్

Mahesh Babu Sarileru Neekevvaru Sattelite rightsసూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్ మొదలు కాకముందే కొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోగా, జెమినీ టీవీ టీవీ ప్రసారహక్కులను కొనుగోలు చేసింది. ఎంత పెట్టి కొన్నారో తెలియకపోయినా తెలుగు సినిమాలో ఇవి అతిపెద్ద డీల్స్ సరసన ఉంటాయని తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ వాచ్చే నెల 5 నుండి కాశ్మీర్ లో జరగబోతుందని సమాచారం వస్తుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆయన ఒక ఆర్మీ సోల్జర్ గా కనిపించబోతున్నారు. కాగా, ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ చెయ్యాల్సి ఉంది.

ADVERTISEMENT

పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా….మంచి యాక్షన్ సినిమాగా ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. మహేష్ కొరకు ఇటలీ నుండి స్టంట్స్ నిపుణుల బృదం ఇండియాకి వచ్చారట. వారి పర్యవేక్షణలో స్టంట్స్ కి సంబంధించి ప్రత్యేక శిక్షణలో మహేష్ పాల్గొంటున్నారని సమాచారం. అలాగే మహేష్ ఈ మూవీ కొరకు ప్రత్యేకమైన కసరత్తులు చేయడంతో పాటు డైట్ విషయంలో కూడా గట్టి జాగ్రత్తులు తీసుకుంటున్నారట.

ADVERTISEMENT
Latest Stories