పురచేతి వాటంతో ప్రిన్స్ తనయుడు!

Mahesh Babu Son Gautham - left hand bowlingMahesh Babu Son Gautham - left hand bowlingప్రిన్స్ మహేష్ బాబుకు సినిమాలు కాకుండా క్రికెట్ అంటే చాలా మక్కువ అన్న విషయం తెలిసిందే. సచిన్ వీరాభిమాని అయిన మహేష్ బాటలోనే పయనిస్తోన్న ప్రిన్స్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా జెంటిల్మెన్ గేమ్ కు వీరాభిమాని. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ జరిగినపుడు విక్టరీ వెంకటేష్ తో పాటు గౌతమ్ ను కూడా స్టేడియంలో వీక్షించవచ్చు.

ఎప్పుడూ క్రికెట్ చూస్తూ కనిపించిన గౌతమ్, ఈ సారి మాత్రం క్రికెట్ ఆడుతూ దర్శనమిచ్చాడు. ఆదివారం ఆట అంటూ నమ్రత పోస్ట్ చేసిన ఫోటోలలో గౌతమ్ బౌలింగ్ వేస్తూ కనిపించాడు. విశేషం ఏమిటంటే… గౌతమ్ ఎడమ చేతి వాటం. మణికట్టు స్పిన్నర్ల మాదిరి పురచేత్తో బౌలింగ్ చేస్తోన్న గౌతమ్ ఫోటోలను ప్రిన్స్ అభిమానులు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories