నాడు బాహుబలి 2… నేడు స్పైడర్..!

ప్రపంచ వ్యాప్తంగా “బాహుబలి 2” తుఫాన్ ప్రారంభం కావడానికి కొద్ది గడియలు ముందు… బాలీవుడ్ నాట ప్రముఖులంతా ఈ సినిమా ప్రీమియర్స్ ను వీక్షించడానికి సిద్ధమవుతున్న తరుణం… అయితే ఇంతలో విషాదకరమైన వార్త. ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ‘ఇక లేరు’ అన్న సమాచారంతో బాలీవుడ్ శోకసంధ్రంలో మునిగిపోయింది. అంతటి మంచి నటుడు కాలం చేసినందుకు గానూ… తన గౌరవాన్ని నిలుపుకోవానికి “బాహుబలి 2” ప్రీమియర్స్ ను కాన్సిల్ చేసి చిత్ర నిర్మాణ సంస్థ తమ స్వభావాన్ని బయట పెట్టుకుంది. దీంతో ‘బాహుబలి 2’ యూనిట్ పై ప్రశంసల జల్లు కురిసింది.

ADVERTISEMENT

మళ్ళీ అదే సీన్ టాలీవుడ్ లో కూడా రిపీట్ అయ్యింది. ఒక్క ప్రిన్స్ అభిమానులే కాక, యావత్తు చిత్ర సీమ మొత్తం “స్పైడర్” టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎప్పటి నుండో వాయిదాలు వేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్, డేట్, సమయంతో సహా స్పష్టంగా వెల్లడించారు. ఇంకేముంది… ‘స్పైడర్’ టీజర్ చూడడానికి అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణంలో… టాలీవుడ్ కు పెద్ద షాక్ తగిలింది. తెలుగు చిత్ర పరిశ్రమ ‘పెద్ద దిక్కు’ను కోల్పోయిందన్న వార్త అందరినీ విషాదంలోకి నెట్టేసింది. దీంతో ‘స్పైడర్’ చిత్ర యూనిట్ కూడా టీజర్ విడుదలను వాయిదా వేస్తూ తమ ఉదాత్తమైన స్వభావాన్ని చాటుకుంది.

ప్రస్తుత తరం సినీ జనాలంటే ఒక్క బిజినెస్ తప్ప, మరొకటి పట్టదనే విమర్శలు ఉన్న చిత్ర పరిశ్రమలో… మానవతా విలువలకు ఎక్కడా లోటు లేదని ఈ రెండు సంఘటనలు చాటిచెప్పాయి. మానవీయ విలువల తర్వాత ఎలాంటి వ్యాపారాలైనా అని తెలియజెప్పిన ఈ రెండు నిర్మాణ సంస్థలు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. ఇక తాజా సమాచారం ప్రకారం ‘స్పైడర్’ టీజర్ ను జూన్ 1వ తేదీన ఉదయం 10.30 నిముషాలకు యూ ట్యూబ్ లో విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.

ADVERTISEMENT
Latest Stories