‘శ్రీమంతుడు’ సినిమాలో దేవరకోట అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన ప్రిన్స్ మహేష్ బాబు రీల్ లైఫ్ కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అదే స్ఫూర్తితో తన స్వగ్రామం బుర్రిపాలెం దత్తత తీసుకుని అభివృద్ధి చేయ తలంపుతో ఆదివారం నాడు విచ్చేసిన ప్రిన్స్ రియల్ లైఫ్ కు కూడా ప్రజలు పట్టం కట్టారు. అయితే సినిమాలో పది నిముషాల్లో చేసిన అభివృద్ధి, నిజంగా చేయాలంటే కనీసం పది సంవత్సరాలైన పట్టే పరిస్థితి.
ఇదిలా ఉంటే, ‘శ్రీమంతుడు’ సినిమాకు సంబంధించి మరియు బుర్రిపాలెంలో మహేష్ పర్యటనకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో కనువిందు చేస్తోంది. ‘శ్రీమంతుడు’ సినిమాలో జాగో జాగో పాటలో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నపుడు చేయి చూపుతూ ప్రిన్స్ ‘అభివాదాలు’ చేసారు. అదే ఫీట్ ఆదివారం నాడు బుర్రిపాలెంలో కూడా రిపీట్ అయ్యింది.
యాంగిల్ మారిందేమో గానీ, ప్రిన్స్ హావభావాలు, చేయి చూపించడం మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉండడం గమనించదగ్గ విషయం. ‘శ్రీమంతుడు’ సినిమా కధ తన మనసుకు దగ్గరైనదిగా ప్రిన్స్ ఆనాడు ఎందుకు చెప్పారో బహుశా ఈ ఫోటో చెప్పవచ్చు. తను అనుకున్న కార్యక్రమానికి వచ్చే సరికి రీల్ లైఫ్ కు, రియల్ లైఫ్ కు, పెద్దగా వ్యత్యాసం లేకుండా ఉండడం అందరికీ అయితే సాధ్యమయ్యేది కాదు మరి!



