ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ కు నిదర్శనం!

mahesh babu srimanthudu to get 100 croresతెలుగునాటే కాకుండా దేశ విదేశాల్లో ప్రిన్స్ కీర్తి బాగానే పాకింది. దీనికి నిదర్శనమే జయాపజయాలతో సంబంధం లేకుండా ఇతర దేశాల్లో ప్రిన్స్ చిత్రాలు వండర్స్ సృష్టిస్తుంటాయి. చిన్నపిల్లలు, మహిళలు, ఫ్యామిలీ, యూత్ అన్న తారతమ్యం లేకుండా అన్ని వర్గాలను ఒక రౌండ్ వేసుకున్న ప్రిన్స్ క్రేజ్ ఎంత స్థాయికి చేరింది అంటే పదవ తరగతి పిల్లలకు మహేష్ బాబు సినిమా పాఠాలు చెప్పేటంత వరకు!

ADVERTISEMENT

ఇంగ్లీష్ పాఠ్యపుస్తకానికి సంబంధించిన ఒక పేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. “శ్రీమంతుడు” సినిమా కధను ఒక పాఠంగా ఉండడం విశేషం. ఒక టాపిక్ డైరీకి సంబంధించిన అంశంలో “శ్రీమంతుడు” రివ్యూను చేర్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సినీ అభిమానుల్లో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT
Latest Stories