ఓ పక్కన కృష్ణ… మరో పక్కన మహేష్..!

Mahesh Babu -Super star Krishnaసోషల్ మీడియాలో తన భర్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను అందించడంలో చురుగ్గా ఉండే నమ్రత శిరోద్కర్, తాజాగా రుమేనియాలో జరుగుతున్న “స్పైడర్” సాంగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ను అందించడంలో బిజీగా ఉంది. కాలు మీద కాలు వేసుకుని మహేష్ కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసిన నమ్రతా, మరికొద్దిసేపటికే అలాంటి ఆ ఫోటోను కాస్త ఎడిట్ చేసి, ఓ పక్కన మహేష్, మరో పక్కన అదే ఫోజులో ఉన్న కృష్ణ ఫోటోను పోస్ట్ చేసి అభిమానులకు ఫుల్ ఖుషీని పంచింది.

ADVERTISEMENT

“మా లెజెండరీ మామ గారు… ఆయన అందమైన కుమారుడు…” అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ ఫోటోలో నేడు యూత్ అంతా ఫ్యాషన్ గ చెప్పుకునే ప్యాంటును పైకి మడవడం అనేది సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజుల్లోనే అనుసరించినట్లుగా కనపడుతోంది. చెప్పులు వేసుకుని బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో గాగుల్స్ పెట్టుకుని ఉన్న ప్రిన్స్, చూపరులను కట్టిపడేస్తున్నాడు. ఫోటో ఇంత అద్భుతంగా ఉంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టకుండా ఎలా ఉంటుంది? ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే..!

ADVERTISEMENT
Latest Stories