మహేష్ బాబు చంద్రబాబు ను ప్రభావితం చెయ్యలేకపోయాడు?

Mahesh Babu Support YS Jagan Mohan Reddyఆ మధ్య ఒక మీడియా ఇంటర్వ్యూ లో మహేష్ బాబు జగన్ మరియు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పై పొగడ్తలు కురిపించాడు. ఈ విషయం వల్ల ఆయన బావ గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్ కి చంద్రబాబు తో ఇబ్బంది అని అంతా భావించారు. కానీ అది జరగలేదు. జయదేవ్ మీద చంద్రబాబు నమ్మకం ఏమాత్రం తగ్గలేదు.

ADVERTISEMENT

జయదేవ్‌ కు ఇప్పుడు ఢిల్లీలో కీలక బాధ్యతలు ఇప్పించారు చంద్రబాబు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటిలో మెంబర్‌గా, కేంద్ర రక్షణ శాఖ స్టాండింగ్ కమిటి మెంబర్‌గా గల్లా జయదేవ్ నియమితులు అయ్యారు… వీటితో పాటు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన పార్టీ సెంట్రల్ కమిటీలో జయదేవ్ కు, అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు.

జయదేవ్ ఉన్నత చదువు కున్న వ్యక్తి. అంతే కాకుండా, కేంద్రంలోని బీజేపి పెద్దలతో, కేంద్ర మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయి. బిజినెస్‌మెన్‌గా ఆయనకు వివిధ రంగాలపై స్పష్టమైన అవగాహన కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు ఆయన మీద నమ్మకం ఉంచారు. దీనిబట్టి మహేష్ బాబు వ్యాఖ్యలు ఏ మాత్రం చంద్రబాబు ను ప్రభావితం చెయ్యలేకపోయాయి అనే అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories