మహేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు!

Mahesh babu to release srinivasa kalyanam trailerఆగష్టు 9వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు. ఇందుకోసం అభిమానులు ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలతో నానాహంగామా చేస్తున్నారు. ఇది ప్రిన్స్ బర్త్ డే విషయం. అయితే ఇదే రోజున నితిన్ హీరోగా నటించిన “శ్రీనివాస కళ్యాణం” సినిమా రిలీజ్ కు ప్లాన్ చేసారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.

[m9ad]

ADVERTISEMENT

దీంతో ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. గురువారం సాయంత్రం 5.30 నిముషాలకు యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ‘శతమానం భవతి’ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ADVERTISEMENT
Latest Stories