బాలీవుడ్ కు దీటుగా తెలుగు సినిమా స్టామినాను ఓవర్సీస్ లో నిలబెట్టిన హీరోలలో ప్రిన్స్ మహేష్ స్థానం ఎప్పుడూ నెంబర్ “1.” స్థానిక మార్కెట్ లో మహేష్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, అవి ఓవర్సీస్ లో దుమ్ము రేపే వసూళ్ళనే రాబట్టాయి.
గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయిన “శ్రీమంతుడు” సినిమాతో కూడా ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు సినిమా సత్తాను సినీ ఇండస్ట్రీ రుచి చూపించారు మహేష్. ఇక, ఈ ఏడాది సమ్మర్ కానుకగా రాబోతున్న “బ్రహ్మోత్సవం” కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ని తుడిచిపెట్టి మరో కొత్త రికార్డు ను సృష్టించింది.
తెలుగు సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా బాహుబలి 9 కోట్లకు అమ్ముడవ్వగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మాక వెంచర్ “సర్దార్ గబ్బర్ సింగ్” కూడా 11 కోట్లు ప్రీ రిలీజ్ బిజినస్ చేసింది. అయితే “బ్రహ్మోత్సవం” ఏకంగా మాత్రం 13 కోట్లుకు క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుని సంచలనం సృష్టించింది.
సమ్మర్ సెలవుల్లో విడుదల అవుతోన్న అందరి స్టార్ హీరోలను అమెరికాలో ఆటాడుకుందాం… రా అనే విధంగా ప్రిన్స్ మహేష్ బాబు కవ్విస్తున్నట్లుంది. మరి సినిమా కలెక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయో లేదో చూడాలి. ఈ రేంజ్ బిజినెస్ జరగడంతో, సినిమా సక్సెస్ కావాలంటే కనీసం 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరాల్సిందే అంటున్నారు ట్రేడ్ పండితులు.



