కత్తి మహేష్ కి మళ్ళి ఏమయ్యిందో ..’నా చావుకు బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదే ‘. అని నొక్కి చెప్పాడు. కొన్ని నెలల ముందు కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన యుద్ధం అందరికీ తెలిసిందే. గంగపుత్రులు సినిమా హీరో రాంకీ ,కత్తి మహేష్ లు ఒక టీవీ ఛానల్ వాదన లో.. ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. కత్తి మహేష్ .. ‘పవన్ గెస్ట్ హౌస్ నుండి.. తెల్లవారు ఝామున, దర్శకుడు త్రివిక్రమ్ ఎవర్ని దేబెడుతున్నాడో చెప్పనా’ అని అడిగే సరికి.. ఖంగుతిన్న రాంకీ.. పవన్ ఫాన్స్ అధ్యక్షుడు, ఇద్దరూ కలిసి కత్తిమహేష్ తో సయోధ్యకు దిగారు. వెంటనే గొడవ లేదు అని సెల్ఫీలు దిగారు. పవన్ జనసేన పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది కత్తి కోసం.
మళ్ళీ ఏమయ్యిందో.. కత్తి ట్విట్టర్లో ‘ తనకి ఏమి జరిగినా బాధ్యత పవన్ కళ్యాణ్ దేనని, పవన్ ఫాన్స్ చేసే అరాచకాలకు బాధ్యుడు పవన్ కల్యాణే ‘ అని చెప్పాడు. ‘ ప్రాణ భయంతో చెప్పటం లేదని, తనకి ఏమి జరిగిన పవన్ కి బాధ్యత ఉంటుందని. పవన్ తనకు సెక్యూరిటీ కల్పించాలని’ కత్తి మహేష్ ట్విట్టర్ లో కోరాడు. కత్తి మహేష్ కి – పవన్ కి మధ్య వార్, ఇప్పట్లో ఆగేలా లేదు. కత్తిమహేష్ పరోక్షంగా పవన్ తన మీద దాడి చేయబోతున్నాడని చెపుతున్నాడా ?



