ఆ భామకు తెలుగు భాషలో నచ్చని పదం ‘అక్క’

Manchu lakshmi hates word akkaబుల్లితెరపై సందడి చేస్తూ మరోవైపు వెండితెరపై అవాక్కయ్యే పాత్రలను పోషిస్తున్న మంచు లక్ష్మి తనను ‘అక్క’ అంటే ఓ రేంజ్ లో మండి పడుతోంది. ఎంతలా అంటే ‘గుంటూర్ టాకీస్’ ఆడియో వేడుకపై ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ ప్రసంగిస్తూ, మంచు లక్ష్మిని ‘అక్క’ అని పిలవగానే ‘తంతా…’ అనే విధంగా చుట్టూ ప్రక్కల ఆయుధం కోసం వెతికింది.

దీంతో పక్కనే ఉన్న సినిమా హీరో మైక్ అందుకుని, తెలుగు భాషలో మంచు లక్ష్మికి నచ్చని ఒకే ఒక పదం ‘అక్క’ అని చెప్పగానే లక్ష్మితో పాటు ఆడిటోరియం అంతా నవ్వులు విరిశాయి. “తనను మూడవ తమ్ముడు అని భావించు అక్క అని మరోసారి రవికాంత్ చెప్పగానే… ‘వద్దు బాబూ… ఓ దండం…’ అంటూ చెప్పి, చివరికి ఏకపద వాఖ్యంతో ‘లక్ష్మి’ అని పిలిపించుకుంది.

ADVERTISEMENT

సాధారణంగా ఏ ముద్దుగుమ్మ అయినా ‘సోదరి’ భావంతో సంభోదిస్తే సంతోషిస్తారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అలా పిలిచే వారు బహు అరుదు. కానీ, మంచు లక్ష్మి మాత్రం తనను ఆ సోదరి భావంతో సంభోదించవద్దు అని స్పష్టంగా చెప్పేసింది. బహుశా తనకున్న ఇద్దరు ‘మంచు’ సోదరులతో తల బొప్పికట్టినట్లుగా లక్ష్మి హావభావాలు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా మంచు వారమ్మాయి తీరే వేరు కదా!

ADVERTISEMENT
Latest Stories