ఈ కుల రాజకీయాలు సినిమాలతో ముడిపెట్టవద్దు!

manchu manoj about caste politicsనిర్మొహమాటంగా మాట్లాడతరన్న పేరు మంచు మోహన్ బాబు సొంతం అన్న విషయం తెలిసిందే. చాలా సందర్భాలలో అలా మాట్లాడే తనతో విరోధం తెచ్చుకుంటాడని, మోహన్ బాబు సన్నిహితులు చెప్తుంటారు. అలాగే అప్పుడప్పుడు వర్తమాన రాజకీయాలపై కూడా స్పందించి వివాదాల్లో చిక్కుకుంటారనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది. అయితే ఆ ఒరవడికి మోహన్ బాబు తనయులు మాత్రం దూరంగా ఉంటున్నట్లు కనపడుతోంది.

“శౌర్య” సినిమా విడుదల సందర్భంగా మంచు మనోజ్ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలకు – సినిమాలకు ముడిపెట్టవద్దని కోరాడు. “రాజకీయాలు వేరు, సినిమాలు వేరని, సినిమాలను కులంతో ముడిపెట్టవద్దని, ఆ కోణంలో చూడవద్దని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ తాను కోరుకుంటున్నానని, తాము కళాకారులం మాత్రమేనని, ప్రతి ఒక్కరినీ ఆనంద పరిచేందుకు తాము ఎంతో కష్టపడతామని, ఆ కష్టానికి కులంతో లింకు పెట్టవద్దని, ప్రతి ఒక్కరూ కులానికి దూరంగా ఉండాలని” ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు మనోజ్.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories