‘సర్ధార్’ అభిమానికి ‘యుఎస్’లో పెను ప్రమాదం!

Bharat Marella accidentతన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు వెళ్లి వస్తున్న సందర్భంలో గుంటూరు, వెంకటరమణ కాలనీకి చెందిన 24 సంవత్సరాల జయభారత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. యుఎస్ లోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎం.ఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న జయభారత్ శనివారం నాడు, అతని స్నేహితుడుతో కలిసి కారులో ‘సర్ధార్’ సినిమాకు వెళ్ళాడు. అయితే సినిమా వీక్షించి తిరుగు ప్రయాణం అయిన సందర్భంలో ఎదురుగా వచ్చిన వాహనం డీ కొట్టడంతో జయభారత్ కు తీవ్ర గాయాలయ్యాయి. కారును నడుపుతున్న అతని స్నేహితుడు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు.

జయభారత్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి గురించి చెప్పలేమని అన్నారు. అయితే జయ తల్లితండ్రులు వెంటనే చేరుకోవడానికి వారికి పాస్ పోర్టులు లేకపోవడంతో సంబంధిత కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్ దండే పాస్ పోర్ట్ కార్యాలయానికి ఫోన్ చేసి చర్యలను వేగవంతం చేయగా, గుంటూరు ఎంపీ నుండి విదేశాంగ శాఖా మంత్రికి కూడా సమాచారం వెళ్ళింది. తల్లితండ్రుల పాస్ పోర్ట్, వీసాలు పూర్తి కాగానే వారిని వెంటపెట్టుకుని తీసుకెళ్లేందుకు జయభారత్ రెడ్డి సోదరుడు సాంబశివ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories