థియేటర్ల కరెంటు బిల్ కూడా రికవర్ చెయ్యని స్టార్ సినిమా

Master Releaseతమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సంక్రాంతికి విడుదలై తెలుగు, తమిళ బాక్స్ ఆఫీసుల వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. తమిళంలో 50% ఆకుపెన్సి తో కూడా ఇప్పటివరకు ఉన్న రికార్డులను చిత్తకొడుతుంది. మరోవైపు.. తెలుగులో రెండో రోజే రెండు ఏరియాలు తప్ప అన్ని చోట్లా సేఫ్ అయిపోయింది.

కృష్ణా, సీడెడ్ ఈరోజు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే మాస్టర్ తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా విడుదల అయ్యింది. అయితే హిందీలో మాత్రం ఘోరమైన కలెక్షన్లు రాబట్టింది. ఆ సినిమా మొదటి రోజు ఉత్తర భారతంలో షాకింగ్ గా కేవలం ఆరు లక్షల రూపాయిలు రాబట్టిందట.

ADVERTISEMENT

ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్పర్ట్ కమల్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ… ఈ సినిమా కలెక్షన్లు.. థియేటర్ల స్టాఫ్ జీతాలు… ఇతర ఖర్చులు అటుంచి కనీసం థియేటర్ల కరెంటు బిల్ కూడా రికవర్ చెయ్యదని ఎద్దేవా చేశారు. ఈ సినిమా హిందీలో బ్రేక్ ఈవెన్ కు దాదాపుగా 12 కోట్ల మేర వసూలు చెయ్యాలి అది దాదాపుగా అసంభవం అనే చెప్పుకోవాలి.

విజయ్ కు బాలీవుడ్ లో మార్కెట్ లేకపోవడం, ఉత్తరాదిన ఇంకా కరోనా తరువాత థియేటర్ బిజినెస్ పుంజుకోకపోవడం కూడా ఈ దారుణమైన కలెక్షన్లకు కారణమే. ఏది ఏమైనా ఒక స్టార్ హీరో కు ఇటువంటి కలెక్షన్లు అనేది సోషల్ మీడియాలో అభిమానులను ఇబ్బంది పెట్టేవే అని చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories