అతి… ఆత్మహత్య… అంకితం… – పవన్!

Pawan-Kalyan---Jana-Sena---Mega-Fans-Meetమెగా అభిమానులతో జరిగిన ఆత్మీయ సదస్సులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త సంయమనం కోల్పోయినట్లుగా కనపడుతోంది. చిరును పొగడ్తలతో ముంచెత్తుతున్న సమయంలో… ఆనందం తట్టుకోలేక ఓ అభిమాని చేస్తోన్న చేష్టలకు ఆగ్రహించిన పవన్, ‘కూర్చో కూర్చో’ అంటూ తొలుత నింపాదిగా చెప్పారు. అయినప్పటికీ సదరు అభిమాని వినిపించుకోకపోవడంతో, కూర్చో “అతి” చేయకు… అంటూ ఆగ్రహిస్తూ స్పందించారు.

ఆ క్రమంలోనే తన సినీ ప్రస్థానంలో జరిగిన ఓ విషయాన్ని కూడా వెల్లడించారు. ‘సుస్వాగతం’ సినిమా షూటింగ్ లో భాగంగా బస్సు ఎక్కి అందరి ముందు డ్యాన్స్ చేయాలని చెప్పడంతో, చాలా సిగ్గేసిందని, ఆ సమయంలో తన వదినకు ఫోన్ చేసి… ఈ సినిమాలు నాకు సూట్ కావు, నేను చేయలేను, “ఆత్మహత్య” చేసేసుకుంటాను… అని చెప్పినట్లుగా మెగా ఫ్యాన్స్ తో తన అనుభూతులను పంచుకున్నారు.

ADVERTISEMENT

నా ప్రవృత్తి సినిమాలు కానీ, నా వృత్తి ప్రజాసేవేనని, ఎన్జీవో సంస్థ కంటే రాజకీయ పార్టీగా ఎక్కువ సేవ అందించవచ్చనే ఉద్దేశంతో జనసేనను స్థాపించానని, ప్రజాసేవకే తన జీవితం “అంకితం” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన అన్నయ్య జీవితం ఇక సినిమాలకే “అంకితం” అన్న విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు పవర్ స్టార్.

ADVERTISEMENT
Latest Stories