మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ ప్రారంభం కాబోయే ముందు అభిమానులకు అన్ని మంచి శకునాలు ఎదురవుతున్నాయి. మరో వారం, పది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ గారి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను దున్నేస్తోంది.
ఘట్టమనేని బాబీ వివాహ వేడుకకు హాజరైన సమయంగా సందడి చేస్తున్న ఈ ఫోటోలో… చాలా సింపుల్ లుక్ లో ఉన్నా గానీ, అభిమానుల చేత ‘విజిల్స్’ వేయించే విధంగా ఉన్నాడు మెగాస్టార్. వైట్ షర్టులో ఉన్న చిరంజీవిని చూసి మురిసిపోతున్న అభిమానులు… 150వ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు.
మామూలు మొబైల్ కెమెరాలతో తీసిన ఫోటోలో ఈ రేంజ్ లో ఉంటే, సినిమా కెమెరాల్లో ఇలా మెగాస్టార్ యాంగిల్స్ ను చూపిస్తే… ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోవడం ఖాయమే! ఇంత వయసొచ్చినా… కొడుకును మించిన రీతిలో మెగాస్టార్ కనువిందు చేయడం అభిమానులకు మిక్కిలి సంతోషకరమైన విషయం.



