డిప్యూటీ మేయర్ పీఠంపై ఎంఐఎం పాగా?

KCR MIM GHMCE electionsఅధికార పార్టీతో పొత్తు లేకుండా ఒంటరి పోరుకు సిద్ధమైన ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి వరించనుందా? అంటే రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానమే లభిస్తోంది. ఈ విషయమై టీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన టీఆర్ఎస్ పార్టీ అంచనా వేసినట్లుగా, మెజార్టీ సీట్లు సాధించినా డిప్యూటీ పదవిని మాత్రం ఎంఐఎంకే ఇవ్వాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఎంఐఎంకు తగిన సీట్లు వచ్చినా రాకపోయినా ఆ పార్టీ అభ్యర్థి మాత్రం డిప్యూటీ మేయర్ కుర్చీలో కూర్చోవడం ఖాయంగా కనపడుతోంది.

ఇదిలా ఉంటే, ఎంఐఎంతో పొత్తు విషయంలో టీఆర్ఎస్ ఎటూ తేల్చుకోలేకపోతుందనే మరో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య పోటాపోటీ అంచనాలు ఉన్నాయి. లోపాయికారి ఒప్పందాలు ఎలా ఉన్నా, బహిరంగంగా మాత్రం ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అటు టీడీపీ-బీజేపీ కూటమి కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే, అసలు రాజకీయ సమీకరణాలు బయటపడేది మాత్రం ఎన్నికలు ఫలితాలు వెలువడిన తర్వాతే!

ADVERTISEMENT
Latest Stories