లోకేష్ ట్వీట్ల సెగ అప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ కు తగులుతుందా?

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజీ బాలేదని అభిమానులు మొరపెట్టుకున్నా ఆ పార్టీ అధినాయకత్వం అధికారంలో ఉండగా పట్టించుకోలేదు. అంతా అయిపోయాక ఇప్పుడు సర్దుబాటు చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ నుండి పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ సెగ ప్రభుత్వానికి కూడా తగిలినట్టుగానే కనిపిస్తుంది. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరుని అదే సూచిస్తుంది.

ADVERTISEMENT

చంద్రబాబు తనయుడు లోకేశ్‌ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేశ్‌ ట్వీట్‌లు ఆయనే చేస్తున్నారో.. ఎవరైనా రాస్తున్నారో తెలియదన్నారు. ఆయన ట్వీట్ లు అర్దం, పర్దం లేకుండా ఉంటున్నాయని అనిల్ ఎద్దేవా చేశారు. గత రెండు సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఆయన అకౌంట్ నుండి చేసే విమర్శలకు బాగా పబ్లిసిటీ వచ్చింది.

ఆ అకౌంట్ కోసం ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకున్నారు విజయసాయి రెడ్డి. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ అకౌంట్ హేండిల్ చెయ్యడానికి కూడా ఒక టీం ఉంటుంది. అంతెందుకు అనిల్ కు కూడా ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఆయన కూడా ట్వీట్స్ ఎవరితోనో చేయిస్తారు. కాబట్టి లోకేష్ ట్వీట్లు ఆయనే చేస్తున్నారా అనేది అప్రస్తుతం. అవి మరీ అర్దం, పర్దం లేకుండా ఉంటే మంత్రిగారు స్పందించారు. స్పందించారంటే వారికి ఖచ్చితంగా సెగ తగిలినట్టే అని టీడీపీ అభిమానులు సంబరపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories