‘దూకుడు’ సెంటిమెంట్ రిపీట్ చేసిన ‘మిస్టర్’

Mister Repeats Dookudu - Srinu VytlaMister Repeats Dookudu - Srinu VytlaMister Repeats Dookudu - Srinu Vytlaశ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘దూకుడు’ సినిమా సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం తెలిసిందే. ఈ సినిమా విజయానికి ఉన్న అనేక కారణాలలో… హీరో మహేష్ తర్వాత అంతటి స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ఎం.ఎస్.నారాయణ. ‘దూకుడు’ సెకండాఫ్ లో ఎంఎస్ చేసిన నాలుగు స్పూఫ్ వీడియోలు సినిమాను ఎక్కడో నిలబెట్టాడు. ముఖ్యంగా రిపీట్ ఆడియన్స్ రావడానికి ఈ కామెడీ చాలా వర్కౌట్ అయ్యింది. దీంతో స్పూఫ్ లను రూపొందించడంలో దర్శకుడు శ్రీనువైట్ల సిద్ధహస్తుడిగా మారారు.

అంతకుముందు ఎంఎస్ తోనే సూపర్ స్టార్ కృష్ణను అనుకరిస్తూ చేసిన స్పూఫ్ కూడా భారీ ప్రజాధరణను పొందిన విషయం తెలిసిందే. తాజాగా ‘మిస్టర్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీను వైట్ల, గత సెంటిమెంట్ ను అనుసరిస్తూ… రూపొందించిన స్పూఫ్ వీడియోలు ధియేటర్లలో నవ్వులు పంచుతున్నాయి. ‘దూకుడు’ రేంజ్ లో కాకపోయినా, ఓ స్థాయి వరకు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీలతో అందించిన ‘ఊపిరి’ సినిమా స్పూఫ్ వర్కౌట్ అయ్యింది.

ADVERTISEMENT

అలాగే మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాపై వేసిన సెటైర్లు కూడా బాగా పేలాయి. ఓవరాల్ గా సినిమా టాక్ మాత్రం అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ఈ స్పూఫ్ వీడియోలు మాత్రం సినిమాలో బాగా పండాయి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అటు దర్శకుడు శ్రీను వైట్లకు, ఇటు హీరో వరుణ్ తేజ్ కు చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ‘ఆగడు, బ్రూస్ లీ’ సినిమాలు దారుణ పరాజయం కావడంతో, శ్రీను వైట్ల కెరీర్ కు ‘మిస్టర్’ సక్సెస్ అనేది పీక మీద కత్తే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories