సినీలెవల్లో బిజెపి కుమారుడి వివాహ ఆహ్వానం!

MLA Santosh Raosaheb Patil Danveభారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు రావ్‌ సాహెబ్ పాటిల్ దన్వే కుమారుడి వివాహం అతిరథ మహారథుల నడుమ ఆకాశమంత పందిరిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయ‌న కుమారుడు 2014 ఎన్నిక‌ల్లో భోకార్దన్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక‌య్యాడు. ఔరంగాబాద్‌ శివార్లలోని జబిందా ఎస్టేట్‌ లో రాజప్రాసాదాన్ని తలపించేలా పెళ్లి మండపం ఏర్పాటు చేసి పెళ్లి చేశారు.

ADVERTISEMENT

ఈ పెళ్లి ఆహ్వానానికి సంబంధించి రూపొందించిన వీడియోను సంతోశ్ తాజాగా త‌న‌ ఫేస్‌ బుక్ ఖాతాలో ఉంచాడు. పెళ్లి కూతురితో క‌లిసి పెళ్లికొడుకు సైకిల్ తొక్కుతూ, పార్క్‌ లో డ్యాన్స్ వేస్తూ ఉన్న ఆ వీడియో అందరినీ ఆక‌ట్టుకుంటోంది. ఆహ్వాన వీడియోనే ఇంత అద్భుతంగా ఉంటే, తాజాగా జ‌రిగిన ఆయ‌న‌ పెళ్లి ఇంకా ఎంత అద్భుతంగా నిర్వ‌హించారో అని ఫాలోవర్లు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories