వింటున్నారా… వైసీపీలో ఉన్న ‘నీతి’ గల ఎమ్మెల్యే ‘కధ!’

MLA Srikanth reddy hot commentsఅక్రమాస్తుల కేసులతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ ఆస్తుల చిట్టాలో ఇప్పటికే ఈడీ కొన్ని వందల కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసిన విషయం తెలిసిందే. అంటే ప్రస్తుతం ఉన్న కేసుల్లో జగన్ నిర్దోషి అని రుజువైనా, లేకున్నా… అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం వల్లనే ఈడీ ఎటాచ్ చేసిందని స్పష్టం చేసినట్లయ్యింది.

అలాంటి జగన్ కు అండదండగా ఉన్న రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చిన ‘నీతి’ కధ ఇది. తెలుగుదేశం పార్టీ సభ్యులు తనను పార్టీ మారాల్సిందిగా కోరినప్పటికీ, తానూ మాత్రం పార్టీ మారనని, ఒకవేళ అలా తెలుగుదేశం ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతానని, అలా కావడం తనకు ఇష్టం లేదని, జగన్ నాయకత్వంలోనే వైసీపీ సభ్యుడిగా నీతి గల ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉంటానని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించి ‘సేవ్ డెమోక్రసీ’ సంఘీభావ సభలో ‘ఎంపరర్ ఆఫ్ కరెప్షన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ ‘నీతి’ వ్యాఖ్యలు చేసారు. వింటున్నారా అబ్బాయిలు… రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గారి నీతి కధ. అన్నట్లు… ఈ పుస్తకం ఆవిష్కరించడానికి వెళ్ళిన సమయంలోనే ఢిల్లీలో జగన్ కు ఘోర పరాభవం ఎదురయ్యింది..!

ADVERTISEMENT
Latest Stories