జనాభా కన్నా సెల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య పెరిగిన విచిత్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థను విశ్లేషిస్తూ… రాష్ట్ర అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో 3.53 కోట్ల మంది జనాభా ఉండగా, సెల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 3.66 కోట్లుగా ఉండడం అవాక్కయ్యేలా చేస్తోంది.
2011 జనాభా గణాంకాల ప్రకారం మొత్తం 83,03,612 కోట్ల కుటుంబాలు నివసిస్తుండగా, ప్రతి ఇంటికీ సగటున నాలుగు కనెక్షన్లు ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం సెల్ ఫోన్ కనెక్షన్లలో మూడింట ఒక వంతు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే ఉన్నాయి. ల్యాండ్ ఫోన్లు 6.24 లక్షలకు పైగా ఉండగా, 1,314 టెలిఫోన్ ఎక్స్ఛేంజీల ద్వారా ఇవి పని చేస్తున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ టెలిఫోన్ బూత్ ల సంఖ్య 8,220కు తగ్గింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



