పెద్ద స్టార్ అయి ఉండి .. లేడీస్ సమస్య పై ఇవేం మాటలు!

Mohanlal fires on journalistమోహన్ లాల్! భారత దేశంలో ఉన్న అతి తక్కువ మంది సహజ సిద్దమైన నటుల్లో మోహన్ లాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నటించే విధానమే చెప్పవచ్చు ఆయన ‘నటన’కు వన్నె తెచ్చే కధా నాయకుడే అని. మరి అలాంటి కధా నాయకుడు, నలుగురుకి ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు అలా మాట్లాడితే ఎలా అంటూ మండి పడుతున్నాయి మహిళా సంఘాలు. అసలు ఇంతకీ ఏమయ్యింది? మోహన్ లాల్ పై మండి పడే అంత అవసరం ఎందుకు వచ్చింది అని అసలు కధలోకి మెల్లగా జారుకుంటే…

[m9ad]

ADVERTISEMENT

#మీటూ ఉద్యమం గురించి అందరికే తెలిసిందే. దానికి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు. అయితే అలాంటి ఉద్యమంపై మళయాళం మూవీ యాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి, మోహన్ లాల్ ఆ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఇక్కడ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఇక ఆయన ఏం మాట్లాడారు? ఎక్కడ మాట్లాడారు అంటే, దుబాయ్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన ఈ #మీటూ పై స్పందిస్తూ, అదంతా ఎవరికి వాళ్ళు కావాలని చేస్తున్న రాద్డాంతం అని, ఉద్యమం అంటేనే ఒక ఫ్యాషన్ అయిపోయింది అని. లైంగిక వేధింపులు అనేవి ప్రతీ చోటా ఉంటాయి అని, అదేదో సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నట్లుగా ప్రచారం చెయ్యడం మరీ దారుణం అని, పైగా అలాంటివి అనుభవం అయిన వారికే ఆ బాధ తెలుస్తుంది తప్ప, నాకు ఎప్పుడూ అలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు, దాని గురించి నేను మాట్లాడటం సరికాదు అంటూ దాట వేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే, సరే కాసేపు అదంతా ట్రాష్ అనుకుందాం, ఇండస్ట్రీలోనే కాదు ప్రతీ చోట ఉంటుంది అని ఆయన సెలవిచ్చారుగా అదీ నిజమే అనుకుందాం, మరి అదే నిజం అయితే, ఒక భాధ్యత కలిగిన హీరోగా, అత్యంత ఆదరణ కలిగిన కధా నాయకుడుగా ఉన్న ఆయన తాను కూడా స్త్రీలపై జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై పోరాటానికి అండగా నిలబడాలి కానీ, అవేవో ఫ్యాషన్ కోసం చేస్తున్నారు అంటూ అనడం ఏమాత్రం న్యాయమో ఆయనకే తెలియాలి.

అయితే ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే, అనుభవించిన వారే దాని గురించి మాట్లాడాలి అంటున్న అదే ఆయన, తనను ఈ స్థాయిలో నిలబెట్టిన మళయాళం ఇండస్ట్రీలోనే ఇలాంటి ఘటనలు జరిగితే పట్టించుకోకుండా చూసి చూడనట్లు వదిలేసిన అమ్మ ప్రెసిడెంట్ ఆయన. సొంత వారినే పట్టింకోని ఆయనకు ఈ ఆవేదన బరువు ఎంతో ఎలా తెలుస్తుందిలే. ఏది ఏమైనా, ప్రతిష్టాత్మకమైన “అమ్మ” (అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ యాక్టర్స్)కి ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన ఇంత భాద్యతారాహిత్యంగా మాట్లాడటం కాస్త ఇబ్బంది కర పరిణామమే.

ADVERTISEMENT
Latest Stories