నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. కధ కుదిరితే తన 100వ సినిమానే మోక్షజ్ఞ మొదటి సినిమా అవుతుందని బాలయ్య అంటున్నారు. “డిక్టేటర్” చూసి మోక్షజ్ఞ ఇచ్చిన రేటింగ్ బాగుందని, దీంతో భవిష్యత్తులో తనకు తానూగా కధలను ఎంపిక చేసుకోగలడనే నమ్మకం వచ్చిందని బాలయ్య అన్నారు.
ఒక స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా మోక్షజ్ఞ ఉండాలని, ఇలా చేయాలి, అలా చేయాలి అని నేనెప్పుడు నియత్రించనని, వీళ్ళని కలవాలి, వాళ్ళని కలవాలి అని ఉండదు, అతను కోరుకుంటే ఎవర్ని అయినా కలుసుకోవచ్చు, నేను అలా చేస్తే బయటకు చెప్పకపోయినా లోన బాధపడవచ్చని, అందుకే అన్ని మజాలు ఆస్వాదించాలని కోరుకుంటానని, ఈ సినీ ప్రపంచమే వినోదాన్ని, సందేశాన్ని అన్నింటిని ఇస్తుందని… మోక్షజ్ఞ విషయంలో తానూ అనుసరిస్తున్న విధానాన్ని చెప్పుకొచ్చారు బాలకృష్ణ
ADVERTISEMENT
ADVERTISEMENT





