మరో తమిళ ‘భూతం’ వస్తోంది!

mooch tamil  movie dubbed in telugua as sasikalaహారర్ సినిమాలకు ఉండే ఆదరణ వేరు. వెండితెరపై కాస్తంతా దర్శకుడు భయాన్ని పండించగలిగితే నిర్మాతకు మిగిలేది కాసుల పంటే. అలాంటి సినిమాలో గతేడాది తమిళంలో విడుదలైన “మూచ్” చిత్రం ఒకటి. ప్రముఖ దర్శకుడు భారతిరాజా సోదరుడు జయరాజ్ నటించిన ఈ సినిమాను భారతిరాజా శిష్యుడు విను భారతి దర్శకత్వం వహించారు. ఇపుడు ఈ సినిమాను తెలుగు “శశికళ” పేరుతో ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.

ADVERTISEMENT

ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మతో వరుసగా చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ సినిమా తెలుగు హక్కులను తీసుకుని విడుదల చేస్తున్నారు. హారర్ చిత్రాలను అమితంగా ఇష్టపడే సినీ ప్రేమికులకు ఈ “శశికళ” ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు నిర్మాత. ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో జయరాజ్ తో పాటు నితిన్ రాజ్, మిషా ఘోషల్ లు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

ADVERTISEMENT
Latest Stories