కరోనా సాయం విషయంలో విజయ్ దేవరకొండపై రెండు దురుదేశం తో కూడిన కథనాలు ప్రచురించిన ఒక ప్రముఖ వెబ్ సైట్ పై ఆయన విరుచుకుపడ్డారు. మీరు బతికేదే మా ఇండస్ట్రీ మీద. యాడ్స్ ఇవ్వకపోతే సినిమాలపై దుష్ప్రచారం చేస్తారు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే చెత్త వార్తలు రాస్తారు. చిల్లర వార్తలు రాసి డబ్బుల సంపాదిస్తారు.
డొనేషన్లైనా, ఏవైనా నాకు ఇష్టం ఉన్నప్పుడు.. నాకు నచ్చినప్పుడు.. ఎవరికి ఇవ్వాలో.. ఎవరికి ఇవ్వొద్దో నా మనసు చెప్పనట్టు నడుచుకొంటాను. నేను కష్టపడి సంపాదించిన సొమ్ము అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆ రెండు కథనాలను చదివి వినిపించి విరుచుపడ్డారు. అయితే విజయ్ కు ఈ విషయంలో ఇండస్ట్రీ నుండి అనూహ్యమైన మద్దతు వచ్చింది.
మొదటగా మహేష్ బాబు దీనిమీద స్పందించి విజయ్ కు సంపూర్ణ మద్దతు తెలిపాడు. ఇండస్ట్రీ ఫేక్ న్యూస్ విషయంలో కలగజేసుకోవాలి అని అభ్యర్దించాడు. దాని తరువాత అనిల్ రావిపూడి, అనిల్ సుంకర, రవితేజ, వంటి వారు కూడా ఈ విషయంలో విజయ్ కు మద్దతు తెలిపారు. అయితే ఫేక్ న్యూస్ పై యుద్ధం రాంగ్ టైం లో మొదలయ్యిందా అని కొందరి అనుమానం.
“ప్రస్తుతం ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. ఈ టైం లో దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశాలు తక్కువ. సినిమాలు మొదలయ్యే సమయానికి కూడా కొన్ని నెలల పాటు ఇండస్ట్రీలో ఎవరి కష్టాలు వారు పడతారు. అంతా సర్దుకునే సరికి అందరూ మర్చిపోయే అవకాశం ఉంది. అయితే ఫేక్ న్యూస్ మీద, బ్లాక్ మెయిలింగ్ మీదా స్పందించడం మాత్రం మంచిదే, ” అంటున్నారు నిపుణులు.



