Mr Bachchan Double Ismart Thangalaan

ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు జరుపుకోవడానికి దేశ మొత్తం ఎదురు చూస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడానికి ఈ పంద్రాగస్ట్ ను ఎంచుకున్నారు.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు ఈ పంద్రాగస్ట్ నాటికల్లా పూర్తి చేసి తీరుతాం అంటూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ అయినా బిఆర్ఎస్ కి సవాల్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఆపేసిన అన్న క్యాంటిన్లను ఈ పంద్రాగస్ట్ నాటికీ తిరిగి ప్రారంభిస్తాం అంటూ హామీ ఇచ్చి దాని అమలుకు సిద్దమయ్యింది.

ఇక రాజకీయ పార్టీల పంద్రాగస్ట్ బహుమతులు ఇలా ఉంటే ఇక టాలీవుడ్ నుండి రెండు బడా సినిమాలు, ఒక చిన్న సినిమా, అలాగే ఒక కోలీవుడ్ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…

ముందుగా పూరి, రామ్ పోతినేని కాంబోలో ఇస్మార్ట్ కు సీక్వెల్గా రాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ రెడీ అయితే దానికి పోటీ ఇవ్వడానికి హరీష్, రవితేజ కాంబోలో రాబోతున్న మూడో సినిమా ‘మిస్టర్ బచ్చన్’ సిద్దమయ్యింది.

దీనికి తోడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన ‘ఆయ్’ కూడా తన అదృష్టం పరీక్షించుకోనుంది. ఇక విక్రమ్ నటిస్తున్న కోలీవుడ్ మూవీ ‘తంగలాన్’ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

Also Read – నమ్మలేం దొరా…!

డబుల్ ఇస్మార్ట్ తో పూరి తన మార్క్ చూపించి మళ్ళీ తన కెరీర్ ను గాడిన పెట్టుకోవాలని ఆశిస్తుంటే, గత కొంతకాలంగా మెగా ఫోన్ కు దూరమైన హరీష్ మిస్టర్ బచ్చన్ తో ఇండస్ట్రీకి మరోసారి తన సత్తా చాటాలని ఆరాటపడుతున్నారు.

అలాగే తంగలాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకోవాలని విక్రమ్ కలలు కంటున్నారు. ఇక ఈ మూడు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను తన వైపు ఆకర్షించడానికి నార్నే నితిన్ ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేస్తున్నారు. మరి ఈ పంద్రాగస్ట్ వీకెండ్ ఎవరిని తన వైపు రప్పించుకుంటుందో చూడాలి.




ఇలా ఈ ఆగష్టు పదిహేను అటు పొలిటికల్ సర్కిల్స్ లోను ఇటు ఇండస్ట్రీ వర్గాలలోను ఆసక్తిని రేపుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పంద్రాగస్ట్ న తామిచ్చిన హామీలని అమలు చేసి ప్రజలకు స్వాతంత్య్ర పండుగ కానుకను ఇవ్వనున్నాయి. అలాగే భారీ అంచనాలతో థియేటర్లను వచ్చిన ప్రేక్షకుల అంచనాలను నిలిబెట్టుకుని ఈ పంద్రాగస్ట్ ను తమకు ఒక స్పెషల్ డే గా మార్చుకోవడానికి ఈ నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయి.