కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్ల ఎందుకు వివక్ష చూపుతుందో అన్న విషయంపై ఇప్పటివరకు అనేక రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. అందులో ప్రధానమైనది… 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షానికి ఎదురుగా వెళ్లి… తాము అధికారంలోకి రావాలనే అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. అయితే ఇవే వ్యాఖ్యలు నిజమంటున్నారు టిడిపి ఎంపీ మురళీమోహన్.
ADVERTISEMENT
“ఏపీలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని… అయితే, ఆ విషయం అంత తేలిక కాదని మిత్రపక్షానికి చురకలు అంటించగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పని కేంద్రం, మరి ప్రకటనకు ఇంకెందుకు ఆలస్యం చేస్తోందని” నిరసన గళం వినిపించారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి కేంద్రం తీరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం… భవిష్యత్తు రాజకీయాలను చూపిస్తోందని పొలిటికల్ విశ్లేషణలు ఊపందుకున్నాయి.
ADVERTISEMENT



