తెలుగు సినిమా సంగీత జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి త్వరలో రిటైర్‌మెంట్ అవ్వబోతున్నట్లుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఏదో సందర్బంలో స్వయంగా కీరవాణి సంగీతానికి దూరం అవ్వాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో అప్పటి నుండి కూడా ‘బాహుబలి’ పూర్తి అయిన వెంటనే కీరవాణి సంగీతంకు గుడ్ బై చెప్తాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు రాజమౌళి అన్ని సినిమాలకు కీరవాణి సంగీతాన్ని అందిస్తూ వచ్చాడు. కీరవాణి రిటైర్‌మెంట్ తర్వాత రాజమౌళి ఎవరితో పని చేస్తాడు అంటూ చర్చ జరిగింది.
ఇంత భారీ చర్చ మధ్య తాజాగా కీరవాణి తన రిటైర్‌మెంట్‌పై ఒక క్లారిటీ ఇచ్చాడు. తాను సంగీతానికి పూర్తిగా దూరం అవ్వను అని, కాని కొన్ని విషయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అవి ఏంటివి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సంవత్సరం తర్వాత వాటిపై ఒక క్లారిటీ ఇస్తాను అంటూ కీరవాణి చెప్పుకొచ్చాడు. దాంతో ఇన్నాళ్లుగా కీరవాణి రిటైర్‌మెంట్‌పై వస్తున్న వార్తలకు బ్రేక్ పడ్డట్లయ్యింది. ప్రస్తుతం ‘బాహుబలి’ రెండవ పార్ట్ కోసం కీరవాణి స్వరాలను సమకూర్చుతున్నాడు. మొదటి పార్ట్ ఆడియో సక్సెస్ అయ్యింది. అదే విధంగా రెండవ పార్ట్ పాటలు సైతం సక్సెస్ అవ్వడం ఖాయం అని ఆయన సన్నిహితులు నమ్మకంతో ఉన్నారు.





