ఈ ఏడాది సంక్రాంతి పెద్దగా అచ్చి రాకపోయినా సమ్మర్ మాత్రం టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న రెండు పెద్ద సినిమాలు విజయవంతం కావడంతో, బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఇప్పటికే ‘రంగస్థలం’ నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టగా, వాటిని అందుకోవడానికి ‘భరత్ అనే నేను’ పయనిస్తోంది.
అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ విడుదలయ్యే లోపు ‘భరత్ అనే నేను’ సినిమా ‘రంగస్థలం’ రికార్డులు కొట్టినా, లేకున్నా, ఆ తర్వాత స్థానంలో నిలవడం అయితే ఖాయం. వరుస సమ్మర్ హిట్స్ తో ఉన్న అల్లు అర్జున్ ముందున్న రెండు టార్గెట్స్… భరత్ అనే నేను… రంగస్థలం..! ఈ రెండింటిని కొడితే గనుక, అల్లు అర్జున్ అనే పేరు నెంబర్ 1 స్థానానికి బరిలో ఉన్నట్టే చెప్పవచ్చు.
ఎందుకంటే… రామ్ చరణ్, మహేష్ బాబుల సినిమాలు స్టార్ డైరెక్టర్లతో తీసినవి. ఖచ్చితంగా ఆయా సక్సెస్ లలో సింహాభాగం సుకుమార్, కొరటాల శివలకు వెళ్తుంది. అదే ‘నా పేరు సూర్య’ విషయానికి వచ్చేపాటికి వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు కాబట్టి, కీర్తిప్రతిష్టలు వంశీ ఖాతాలోకి, సక్సెస్ రేంజ్ బన్నీ ఖాతాలోకి వెళ్తుంది. దీంతో ‘నా పేరు సూర్య’ విజయం బన్నీకి చాలా కీలకంగా మారింది.



