‘సైకిల్’పై కూర్చున్న మెగా హీరో!

Naa-peru-Surya-Latest-Poster-Allu-Arjunఈ ఏడాది సమ్మర్ భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా పేరు గాంచిన “నా పేరు సూర్య” మే 4వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేసుకున్న ఈ సినిమా ఆల్బమ్ ఫుల్ ‘జూక్ బాక్స్’ ఈ నెల 22వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు యూ ట్యూబ్ లో అందుబాటులో ఉండనుంది. అదే రోజు సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా, మిలటరీ మాధవరం ఊర్లో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించబోతున్నారు.

దీనికి సంబంధించి ఓ అధికారిక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రొమాంటిక్ మూడ్ లో సైకిల్ పై హీరోయిన్ అను ఇమ్మనుయేల్ తో ఉన్న పోస్టర్ వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్, అనులు కూర్చున్న సైకిల్ హైలైట్ గా కనపడుతోంది. స్టైలిష్ స్టార్ అన్న పేరుకు తగ్గట్లుగానే స్టైల్ గా సైకిల్ పై కనపడుతోన్న బన్నీ లుక్ ఫ్యాన్స్ కు కిక్ ను పంచుతోంది. ఈ సినిమా ద్వారా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories